Share News

రాష్ట్రం కోసం కేసీఆర్‌ పోరాటం స్ఫూర్తిదాయకం

ABN , Publish Date - Nov 29 , 2026 | 10:33 PM

తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్‌ పోరాడిన తీరు స్ఫూర్తిదా యకమని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రా వు, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు పేర్కొ న్నారు. ఆదివారం దీక్షదివస్‌ను పురస్కరించుకుని జిల్లా కేం ద్రంలోని ప్రధాన కూడళ్లలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

రాష్ట్రం కోసం కేసీఆర్‌ పోరాటం స్ఫూర్తిదాయకం

జిల్లా కేంద్రంలో దీక్ష దివస్‌, బైక్‌ ర్యాలీ

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్‌ పోరాడిన తీరు స్ఫూర్తిదా యకమని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రా వు, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు పేర్కొ న్నారు. ఆదివారం దీక్షదివస్‌ను పురస్కరించుకుని జిల్లా కేం ద్రంలోని ప్రధాన కూడళ్లలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అ నంతరం బైపాస్‌ రోడ్డులో గల తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన పోరాటం చారిత్రాత్మకమైందన్నారు. అనేక ఉద్యమాల తో ఢిల్లీకి సెగ తగిలించి, కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష, కేసీఆర్‌ త్యాగాలు, పోరాటాలు చేయడంతో పాటు అన్ని వ ర్గాల ప్రజలు, విద్యార్థులు ఉద్యమాలు చేయడంతో తెలంగా ణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. దీక్ష దివస్‌ అనేది ఒక కార్యక్ర మం కాదని, అమరవీరుల త్యాగాలను ఉద్యమకారుల స్ఫూ ర్తిని స్మరించుకునే గొప్ప కార్యక్రమం అని తెలిపారు. కేసీ ఆర్‌ పోరాటం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్‌ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అ భివృద్ధి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అ క్కూ రి సుబ్బన్న, గాదె సత్యం, తిరుపతి, రాజు, హైమద్‌, ఎర్ర య్య, పలువురు కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

కేసీఆర్‌ చేసిన పోరాటం మరువలేనిది

హాజీపూర్‌ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ చేసిన పోరాటం, త్యాగాలు మరువలేనివని మాజీ ఎమ్మెల్యే నడిపె ల్లి దివాకర్‌రావు అన్నారు. ఆదివారం దీక్ష దివస్‌ సందర్భంగా వేంపల్లి సభా ప్రాంగణం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వేంపల్లి ఫంక్షన్‌హాలులో నిర్వహించిన స మావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ పడిన కష్టాలు నేటి తరానికి తెలియాలంటే దీక్ష దివస్‌ కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమంలో కాంగ్రెస్‌ది మొత్తం మోసాల చరిత్రేనని పేర్కొ న్నారు. మొక్క వోని దీక్షతో మాజీ సీఎం కేసీఆర్‌ తన ప్రా ణాలను సైతం పణంగా పెట్టి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసి పడేలా చేసి రాష్ట్రాన్ని సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2026 | 10:33 PM