త్వరలో కేసీఆర్ బస్సుయాత్ర!
ABN , Publish Date - Jun 11 , 2026 | 05:04 AM
బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మళ్లీ జనాల్లోకి రాబోతున్నట్లు తెలిసింది. కొంతకాలంగా ఫామ్‌హౌ్‌సకే పరిమితమైన ఆయన పార్టీ శ్రేణుల్లో ఉత్సా హం నింపేందుకు...
బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మళ్లీ జనాల్లోకి రాబోతున్నట్లు తెలిసింది. కొంతకాలంగా ఫామ్‌హౌ్‌సకే పరిమితమైన ఆయన పార్టీ శ్రేణుల్లో ఉత్సా హం నింపేందుకు, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు త్వరలోనే బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకోసం రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటు కేటీఆర్ సైతం పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. పాదయాత్ర ద్వారా త్వరలోనే ప్రజల్లోకి వెళ్తానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. తండ్రీకొడుకులు ద్విముఖ వ్యూహంతో ఒకేసారి జనంలోకి వెళ్లటానికి సిద్ధమవటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ యాత్రల షెడ్యూల్‌పై త్వరలోనే స్పష్టత రానుందని బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి.