మిలియన్ మార్చ్ కేసులు కొట్టేయండి
ABN , Publish Date - Mar 31 , 2026 | 06:00 AM
తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011లో నిర్వహించిన మిలియన్ మార్చ్ సందర్భంగా తమపై నమోదైన కేసులు కొట్టివేయాలని కోరుతూ మాజీ సీఎం...
హైకోర్టులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల పిటిషన్లు
హైదరాబాద్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011లో నిర్వహించిన మిలియన్ మార్చ్ సందర్భంగా తమపై నమోదైన కేసులు కొట్టివేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు హైకోర్టులో వేర్వేరుగా క్వాష్ పిటిషన్‌లు దాఖలు చేశారు. వాదనలు విన్న జస్టిస్ కే సుజన ధర్మాసనం.. వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం, ఫిర్యాదుదారులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.