Share News

సెంటిమెంట్‌తో వేల కోట్లు దోచుకున్న కేసీఆర్‌ కుటుంబం

ABN , Publish Date - Sep 22 , 2026 | 06:23 AM

: తెలంగాణ సెంటిమెంటును అడ్డుపెట్టుకుని కేసీఆర్‌ కుటుంబం రూ.వేల కోట్లు దోచుకుందంటూ రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి ఆరోపించారు. హరీష్‌ రావు మంత్రిగా ఉన్నప్పుడే అధికార దుర్వినియోగం చేసి హిమాయత్‌సాగర్‌ బఫర్‌ జోన్‌లో ఫామ్‌ హౌస్‌ కట్టుకున్నాడని విమర్శించారు

సెంటిమెంట్‌తో   వేల కోట్లు దోచుకున్న   కేసీఆర్‌ కుటుంబం
kodandareddy

కోదండరెడ్డి ఆరోపణ

హైదరాబాద్‌, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సెంటిమెంటును అడ్డుపెట్టుకుని కేసీఆర్‌ కుటుంబం రూ.వేల కోట్లు దోచుకుందంటూ రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి ఆరోపించారు. హరీష్‌ రావు మంత్రిగా ఉన్నప్పుడే అధికార దుర్వినియోగం చేసి హిమాయత్‌సాగర్‌ బఫర్‌ జోన్‌లో ఫామ్‌ హౌస్‌ కట్టుకున్నాడని విమర్శించారు. కేటీఆర్‌ మంత్రిగా ఉన్నప్పుడే గండి పేటకు వర్షపు నీరు తీసుకొచ్చే పుల్కాపూర్‌ నాలాను కుదించి ఫామ్‌ హౌస్‌ కట్టుకున్నాడని తెలిపారు. ఈ విషయంలో పేదలకు ఒక రకమైన చట్టాలు.. కేటీఆర్‌, హరీష్‌ రావు లకు ఒక రకమైన చట్టాలు వర్తిస్తాయా అని నిలదీశారు. భూ భారతిని అప్రతిష్ఠ పాలు చేయడానికి కేటిఆర్‌, హరీష్‌ రావులు కుటిల ప్రయత్నాలు చేశారని అన్నారు.

Updated Date - Sep 22 , 2026 | 06:24 AM