Share News

కవిత విడుదల చేసిన వీడియో చూశారా?

ABN , Publish Date - Apr 10 , 2026 | 05:14 AM

కేరళ ప్రజలారా.. రేవంత్‌రెడ్డి మోసపూరిత మాటలు నమ్మొద్దంటూ’’..కల్వకుంట్ల కవిత సోషల్‌ మీడియాలో విడుదల చేసిన వీడియో చూశారా...

కవిత విడుదల చేసిన వీడియో చూశారా?

  • పార్టీ నేతలతో కేసీఆర్‌ ప్రస్తావన

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): ‘‘కేరళ ప్రజలారా.. రేవంత్‌రెడ్డి మోసపూరిత మాటలు నమ్మొద్దంటూ’’..కల్వకుంట్ల కవిత సోషల్‌ మీడియాలో విడుదల చేసిన వీడియో చూశారా... అంటూ బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ తనను కలిసిన ముఖ్యనేతలతో ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది. ఆ వీడియోలో కాంగ్రె్‌సను, బీజేపీని ప్రశ్నిస్తూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ అరాచకాన్ని, వైఫల్యాన్ని చక్కగా వివరించినట్లు ఆయన ఆయా నేతలతో పేర్కొన్నారు. కేరళలో లెఫ్ట్‌ ప్రభుత్వానికి మద్దతు తెలపాలన్న కవిత వీడియో సందేశం తమ రాష్ట్రంలో ప్రభావం చూపిందని సీఎం పినరయి విజయన్‌ ద్వారా తనకు సమాచారం వచ్చిందంటూ...కేసీఆర్‌ స్వయంగా కవిత గురించి ప్రస్తావించడంపై బీఆర్‌ఎ్‌సతోపాటు ఇతర రాజకీయ వర్గాల్లోనూ చర్చ కొనసాగుతోంది.

Updated Date - Apr 10 , 2026 | 05:14 AM