గవర్నర్ ప్రసంగానికి హాజరు కాని విపక్ష నేత కేసీఆరే: బాలూనాయక్
ABN , Publish Date - Mar 18 , 2026 | 05:12 AM
గవర్నర్ ప్రసంగానికి కూడా హాజరు కాని మొదటి ప్రతిపక్ష నేత కేసీఆరేనని ఎమ్మెల్యే బాలూనాయక్ విమర్శించారు. గత ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ...
గవర్నర్ ప్రసంగానికి కూడా హాజరు కాని మొదటి ప్రతిపక్ష నేత కేసీఆరేనని ఎమ్మెల్యే బాలూనాయక్ విమర్శించారు. గత ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ, రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతుందన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని బాలునాయక్ ప్రతిపాదించగా... ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బలపరిచారు. ఈ సందర్భంగా బాలు నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే.. కొంతమంది రాజకీయ నాయకులే డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడడం విచారకరమన్నారు. ప్రభుత్వం ‘హైడ్రా’ను తీసుకువచ్చిన మొదట్లో దానిని ఎందుకు తెచ్చారంటూ తామూ అనుకున్నామని, కానీ ఇప్పటివరకు హైదరాబాద్‌లో రూ.60వేల కోట్ల ఆస్తులను హైడ్రా పరిరక్షించడం గర్వకారణమన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆదిలాబాద్, మామునూరు ఎయిర్‌పోర్టు పనులను త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.