Share News

కవిత పార్టీ ఏర్పాటుతో బీఆర్‌ఎస్‌ నేతల్లో వణుకు

ABN , Publish Date - Apr 27 , 2026 | 05:14 AM

తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్‌) పార్టీ ఏర్పాటు పేరిట కవిత ఇచ్చిన మాస్టర్‌ స్ర్టోక్‌తో బీఆర్‌ఎస్‌ నాయకుల వెన్నులో వణుకు పుట్టించిందని ..

కవిత పార్టీ ఏర్పాటుతో బీఆర్‌ఎస్‌ నేతల్లో వణుకు

  • టీఆర్‌ఎస్‌ నేతలు రూప్‌సింగ్‌, నవీన్‌, వరలక్ష్మి

ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్‌) పార్టీ ఏర్పాటు పేరిట కవిత ఇచ్చిన మాస్టర్‌ స్ర్టోక్‌తో బీఆర్‌ఎస్‌ నాయకుల వెన్నులో వణుకు పుట్టించిందని ఆ పార్టీ నాయకులు విమర్శించారు. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఎల్‌.రూ్‌పసింగ్‌, నవీన్‌ ఆచారి, మంచాల వరలక్ష్మి మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ వదిలేసిన తెలంగాణ వాదాన్ని కవిత భుజానికి ఎత్తుకున్నారని, టీఆర్‌ఎ్‌సకు ఆమెనే నిజమైన హక్కుదారని అన్నారు. 2009లో మహబూబ్‌నగర్‌ ఎంపీగా కేసీఆర్‌ గెలిచేందుకు కవితనే కారణమన్న విషయాన్ని గులాబీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. బీఆర్‌ఎస్‌ ముమ్మాటికీ సోషల్‌ మీడియా పార్టీనే అని, ఇప్పుడే ఇంత ఆగమైతే ఆ పార్టీ నాయకుల పరిస్థితి ఇకపై ఎలా ఉంటుందో ముందు ముందు తెలుస్తుందని హెచ్చరించారు. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ తల్లి విగ్రహాలు, ట్యాంక్‌ బండ్‌పై జాతిపిత జయశంకర్‌ సార్‌ విగ్రహం పెట్టేందుకు ఏం ఇబ్బంది వచ్చిందని బీఆర్‌ఎస్‌ నేతలను ప్రశ్నించారు. .

Updated Date - Apr 27 , 2026 | 05:14 AM