Share News

కవిత ఓ విపక్ష నేతగా పనిచేస్తోంది: కోదండరెడ్డి

ABN , Publish Date - Feb 28 , 2026 | 04:12 AM

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలో ఓ ప్రతిపక్ష నాయకురాలిగా పనిచేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ చైర్మన్‌ ఎం. కోదండరెడ్డి వ్యాఖ్యానించారు.

కవిత ఓ విపక్ష నేతగా పనిచేస్తోంది: కోదండరెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలో ఓ ప్రతిపక్ష నాయకురాలిగా పనిచేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ చైర్మన్‌ ఎం. కోదండరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావటమనేది ఒక మంచి సంప్రదాయమని అన్నారు. గద్వాలలో విత్తన పత్తి సాగు చేస్తున్న రైతుల సమస్యలను కమిషన్‌ దృష్టికి తీసుకురావడానికి శుక్రవారం బీఆర్‌కే భవన్‌కు వెళ్లిన కవిత.. చైర్మన్‌ కోదండరెడ్డితోపాటు కమిషన్‌ సభ్యులను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ.. రంజిత్‌ కుమార్‌ అనే వ్యాపారి నుంచి 10 వేలమంది రైతులకు రూ. 200 కోట్ల బకాయిలు ఉన్నట్లు కవిత తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. గద్వాల ప్రాంతంలో విత్తన పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కవిత కోరారు.

Updated Date - Feb 28 , 2026 | 04:12 AM