Share News

టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

ABN , Publish Date - May 18 , 2026 | 03:01 AM

తెలంగాణ రక్షణ సేవ(టీఆర్‌ఎస్‌) పార్టీలో వివిధ జిల్లాలకు చెందిన పలువురు చేరారు. ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ...

టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

  • పార్టీలోకి ఆహ్వానించిన అధ్యక్షురాలు కవిత

హైదరాబాద్‌, మే 17(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రక్షణ సేవ(టీఆర్‌ఎస్‌) పార్టీలో వివిధ జిల్లాలకు చెందిన పలువురు చేరారు. ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్‌లోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. బోథ్‌ మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు ఆధ్వర్యంలో, ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి చెందిన నర్సింహ, అంబర్‌పేట్‌ నియోజకవర్గానికి చెందిన మతిన్‌ అధ్వర్యంలో యువకులు తెలంగాణ రక్షణ సేన కండువాలు కప్పుకొన్నారు. నర్సాపూర్‌ నియోజకవర్గానికి చెందిన వారు కూడా టీఆర్‌ఎ్‌సలో చేరారు.

Updated Date - May 18 , 2026 | 03:01 AM