Share News

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ను అరెస్ట్‌ చేస్తే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తాం

ABN , Publish Date - May 26 , 2026 | 05:33 AM

ఏపీ ప్రభుత్వం ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ను హైదరాబాద్‌లోనే అరెస్ట్‌ చేయాలని ప్రయత్నిస్తోందని.. అదే జరిగితే ఏపీ సీఎం చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని ...

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ను అరెస్ట్‌ చేస్తే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తాం

  • ఏపీ ప్రభుత్వానికి టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కవిత హెచ్చరిక

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి) : ఏపీ ప్రభుత్వం ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ను హైదరాబాద్‌లోనే అరెస్ట్‌ చేయాలని ప్రయత్నిస్తోందని.. అదే జరిగితే ఏపీ సీఎం చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని తెలంగాణ రక్షణ ేసన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ను జనేసన పార్టీ, ఏపీ పోలీసులు, ఆ రాష్ట్ర ప్రభుత్వం కేసుల పేరుతో వేధిస్తున్నాయని సోమవారం ఎక్స్‌’వేదికగా ఆమె మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా రాజకీయ విశ్లేషణలు చేసే నాగేశ్వర్‌పై కావాలనే అక్రమ కేసులు బనాయిస్తూ కుట్రలు చేస్తున్నారన్నారు. తెలంగాణ సమాజం, తెలుగు ప్రజలు గౌరవించే మేధావిపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదుచేసి వేధింపులకు గురిచేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. కాగా, వడదెబ్బ మృతుడి కుటుంబానికి భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో మార్చురీ వాహనం ఇవ్వకపోవటంతో... కిలోమీటర్‌కు పైగా మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన ఘటనపై కవిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఉదంతంతో రేవంత్‌రెడ్డిది అమానవీయ ప్రభుత్వమని, పేదలపట్ల ఎంత నిర్దయగా ఉందో అర్థమవుతోందని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

Updated Date - May 26 , 2026 | 05:33 AM