ఉప్పల్ భగాయత్ భూములను జూలై 2న స్వాధీనం చేసుకుంటాం: కవిత
ABN , Publish Date - Jun 12 , 2026 | 05:33 AM
ఉప్పల్ భగాయత్‌లో జూలై 2న భూపోరాటం చేసి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు.
హైదరాబాద్, జూన్ 11 (ఆంధ్ర జ్యోతి): ఉప్పల్ భగాయత్‌లో జూలై 2న భూపోరాటం చేసి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఉద్యమకారుల భూపోరాటం పోస్టర్‌ను బంజారాహిల్స్‌లోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో గురువారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇచ్చే విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని విమర్శించారు. వెంటనే ఉద్యమకారులను గుర్తించి వారికి ఇస్తామన్న భూమి ఇవ్వాల్సిందేనన్నారు. కొంత మంది వ్యక్తులు, శక్తులు తెలంగాణ వాదం మీద దాడి చేస్తూ తెలంగాణ స్ఫూర్తిని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారన్నారని విమర్శించారు. వాళ్ల కుట్రలను తిప్పికొట్టేలా భూపోరాటాన్ని విజయవంతం చేయాలని యువత, మహిళలకు కవిత పిలుపునిచ్చారు.