ఈనెల 15 నుంచి కవిత ‘బాయి బాట’
ABN , Publish Date - Jun 04 , 2026 | 05:17 AM
సింగరేణి కార్మికులతో మమేకమయ్యేందుకు తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.
6 రోజుల్లో 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో షెడ్యూల్
హైదరాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికులతో మమేకమయ్యేందుకు తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా ఈనెల 15 నుంచి సింగరేణి ప్రాంతంలో ‘బాయి బాట’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ పర్యటన ద్వారా తన కొత్త పార్టీ టీఆర్‌ఎ్‌సను ఆ ప్రాంత పరిధిలో పటిష్ఠం చేసుకునే ప్రయత్నాలు ఆమె మొదలు పెట్టారు. ‘బాయి బాట’ పేరుతో సింగరేణి భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనుల వద్దకు వెళ్లి కార్మికులతో కవిత నేరుగా సమావేశాలు నిర్వహించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొదటి విడతలో భాగంగా ఆరు రోజుల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేశాయి.