Share News

రేపు కవిత కొత్త పార్టీ ప్రకటన!

ABN , Publish Date - Mar 26 , 2026 | 04:40 AM

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పేరును ఈ నెల 27న ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

రేపు కవిత కొత్త పార్టీ ప్రకటన!

  • తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో పార్టీ

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పేరును ఈ నెల 27న ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. శ్రీరామ నవమి రోజున (శుక్రవారం) ఉదయం 8 గంటలకు తన మెట్టినింటి నుంచే పార్టీ పేరును ప్రకటిస్తారని సమాచారం. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో ఏర్పాటు చేయనున్న తన పార్టీకి సంబంధించి కీలక అంశాలతోపాటు పార్టీ ఆవిర్భావ కార్యక్రమం ఎప్పుడన్నదీ ఆమె వెల్లడించనున్నట్లు జాగృతి వర్గాలు తెలిపాయి. అలాగే ఆమె ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసేది కూడా ఈ సందర్భంగా ప్రకటించే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మహిళలు, యువత, సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుని పార్టీ ముందుకు వెళ్లే అవకాశం ఉందని జాగృతి శ్రేణులు భావిస్తున్నాయి. కాగా ఉద్యమకారులు, వివిధ వర్గాల మేధావులను సంప్రదించడంతోపాటు జాగృతి నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులను కలుపుకొని కొత్త పార్టీకి అనుగుణంగా కవిత పటిష్టమైన కార్యాచరణ రూపొందిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని ఏప్రిల్‌లో నిర్వహించాలని, అది ఎప్పుడన్నదీ శుక్రవారం ఆమె ప్రకటిస్తారని తెలిసింది. పార్టీ ఆవిర్భావం సందర్భంగా భారీ సంఖ్యలో జాగృతి శ్రేణులతో కీలక సమావేశం ఏర్పాటు చేయాలని ఆమె భావిస్తున్నారు.

Updated Date - Mar 26 , 2026 | 04:40 AM