Share News

మహిళా బిల్లుపై కేంద్రం ఏకపక్ష నిర్ణయం: కవిత

ABN , Publish Date - Apr 10 , 2026 | 05:27 AM

కేంద్ర కేబినేట్‌ ఏకపక్ష నిర్ణయంతో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు.

మహిళా బిల్లుపై కేంద్రం ఏకపక్ష నిర్ణయం: కవిత

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): కేంద్ర కేబినేట్‌ ఏకపక్ష నిర్ణయంతో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజనతో మహిళా బిల్లును ముడిపెట్టడం మహిళలకు అన్యాయం చేయడమేనని పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన కాకుండా, 2027లో జరగబోయే జనగణన తర్వాతే మహిళా రిజర్వేషన్లు ప్రకటించాలని గురువారం విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో డిమాండ్‌ చేశారు. ఈసారి జనగణనలో బీసీల లెక్కలు తేలిన తర్వాతే బీసీ మహిళలకు రిజర్వేషన్లలో ప్రత్యేక సబ్‌ కోటా కల్పించాలని స్పష్టం చేశారు. కొన్నిరోజుల్లో ఈ బిల్లుమీద చర్చ పెడతామని కేంద్రం చెబుతోందని, ఈ నేపథ్యంలో తక్షణమే అన్ని పార్టీలకు బిల్లు ప్రతులను అందజేయాలని కోరారు.

Updated Date - Apr 10 , 2026 | 05:28 AM