Share News

ఈ తెలంగాణ తల్లి మన తల్లికాదు: కవిత

ABN , Publish Date - Mar 17 , 2026 | 04:01 AM

రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహం మన తల్లిది కాదని, బతుకమ్మలేకుండా తెలంగాణ ఆత్మకు ప్రతిరూపం కాబోదని జాగృతి అధ్యక్షురాలు....

ఈ తెలంగాణ తల్లి మన తల్లికాదు: కవిత

హైదరాబాద్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహం మన తల్లిది కాదని, బతుకమ్మలేకుండా తెలంగాణ ఆత్మకు ప్రతిరూపం కాబోదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. చరిత్ర నిర్మాణంలో పాల్గొనని వారు మొదట చేయాలనుకునే పనే చరిత్రను చెరిపివేయడమన్నారు. ఉద్యమంలో లేని రేవంత్‌రెడ్డి తెలంగాణ చరిత్రను రూపుమాపే దుస్సాహసం చేస్తున్నారని సోమవారం ఆమె ఓ ప్రకటనలో ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టించిన విగ్రహం తెలంగాణ చరిత్రను అవమానించేలా ఉందన్నారు. సమస్త తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ లేని తెలంగాణ తల్లిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని పేర్కొన్నారు. కాగా ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్లిన ధర్మసమాజ్‌ పార్టీ అధ్యక్షుడు విశారదన్‌ మహరాజ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయటాన్ని ఖండిస్తున్నామని కవిత తెలిపారు.

Updated Date - Mar 17 , 2026 | 04:01 AM