Share News

పార్టీ ఫిరాయించలేదనడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ : కవిత

ABN , Publish Date - Mar 12 , 2026 | 05:36 AM

బీఆర్‌ఎస్‌ బీ ఫామ్‌పై ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్‌ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీచేసిన ప్రజాప్రతినిధి పార్టీ ఫిరాయించలేదని చెప్పడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చలాంటిదని....

పార్టీ ఫిరాయించలేదనడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ : కవిత

హైదరాబాద్‌, మార్చి11 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ బీ ఫామ్‌పై ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్‌ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీచేసిన ప్రజాప్రతినిధి పార్టీ ఫిరాయించలేదని చెప్పడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చలాంటిదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య చరిత్రలోనే చీకటి అధ్యాయమని బుధవారం ఎక్స్‌ వేదికగా ఆమె పేర్కొన్నారు. చట్టసభల సభ్యులు గీత దాటితే వేటు వేయాల్సిన వ్యవస్థ ఒక పార్టీ నిర్ణయాన్ని తమ తీర్పు ద్వారా ప్రకటించినట్లుగా ఉందన్నారు. ఎన్నికల్లో వేరే పార్టీ గుర్తుపై పోటీ చేసిన వారిపైనా అనర్హత వేటు పడ కుంటే దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందా? అని కవిత నిలదీశారు.

Updated Date - Mar 12 , 2026 | 05:36 AM