Share News

రేవంత్‌ బాటలో కవిత: బీఆర్‌ఎస్‌

ABN , Publish Date - Jan 27 , 2026 | 03:47 AM

బీఆర్‌ఎస్‌ను విమర్శించడంలో సీఎం రేవంత్‌రెడ్డి బాటలో జాగృతి అధ్యక్షురాలు కవిత నడుస్తోందని, కేసీఆర్‌ను దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారని...

రేవంత్‌ బాటలో కవిత: బీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ను విమర్శించడంలో సీఎం రేవంత్‌రెడ్డి బాటలో జాగృతి అధ్యక్షురాలు కవిత నడుస్తోందని, కేసీఆర్‌ను దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారని ఆ పార్టీ మహిళా నేతలు ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ నేతలు తుల ఉమ, సుశీలారెడ్డి, రాజ్యలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ సర్కార్‌ అవినీతి, కుంభకోణాలను బీఆర్‌ఎస్‌ నేతలు ఎండగట్టిన మర్నాడే కవిత ప్రెస్‌మీట్‌ పెట్టి బీఆర్‌ఎ్‌సను, ఆ పార్టీ నేతలను విమర్శిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ 6 గ్యారంటీలు, 420 హామీలపై నిలదీయడం లేదని, అధికార పార్టీని ప్రశ్నించడం మాని ప్రతిపక్షంపై విమర్శలు చేయడం ఆమె అవివేకానికి నిదర్శనమని చెప్పారు. పార్టీకి నష్టం కలిగించేలా ఏ ఉద్దేశంతో విమర్శలు చేస్తున్నారో ఆమె చెప్పాలన్నారు. బీఆర్‌ఎ్‌సలో పదవులు అనుభవించి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బయటకువెళ్లి విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఇంతకుముందు అవినీతి కనిపించలేదా అని నిలదీశారు. బీఆర్‌ఎ్‌సపై విమర్శలు ఆపకుంటే సహించేదిలేదని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు.

Updated Date - Jan 27 , 2026 | 03:47 AM