Share News

రేవంత్‌రెడ్డి కర్కోటక ముఖ్యమంత్రి: కవిత

ABN , Publish Date - May 27 , 2026 | 04:55 AM

ఆడబిడ్డల ఇళ్లను కూల్చుతూ వారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్న రేవంత్‌రెడ్డి కర్కోటక ముఖ్యమంత్రి అని తెలంగాణ రక్షణ సేన ...

రేవంత్‌రెడ్డి కర్కోటక ముఖ్యమంత్రి: కవిత

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): ఆడబిడ్డల ఇళ్లను కూల్చుతూ వారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్న రేవంత్‌రెడ్డి కర్కోటక ముఖ్యమంత్రి అని తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. నవ్య అనే మహిళ ఇంటిని కూలగొట్టి ఆమెకు మనశ్శాంతి లేకుండా చేశారని, వంద రూపాయల చీర ఇచ్చి ఆడవాళ్లను కోటీశ్వరులు చేస్తున్నామంటూ ఈ సీఎం అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ధర్మసమాజ్‌ పార్టీ అధ్యక్షుడు విశారదన్‌ మహారాజ్‌, వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేత బాధితు లు, ట్రిపుల్‌ ఆర్‌ నిర్వాసితులు, వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం కడ్లాపూర్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ బాధితులతో కలిసి మంగళవారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను కలిసి ఆమె వినతిపత్రం సమర్పించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌ రెడ్డి సర్కార్‌ పేదలకు చేస్తున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు.

Updated Date - May 27 , 2026 | 04:55 AM