తరుగు లేకుండా ధాన్యం కొనాలి
ABN , Publish Date - May 23 , 2026 | 05:24 AM
ధాన్యం కొనుగోళ్లు అంశంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం ఆందోళన చేపట్టారు.
రైతుల ప్రాణాలు పోతుంటే పట్టదా ?: కవిత
సచివాలయం ఎదుట ధాన్యం పోసి నిరసన
కవిత, టీఆర్‌ఎస్ శ్రేణుల అరెస్టు, విడుదల
ఖైరతాబాద్, చాంద్రాయణగుట్ట, మే 22(ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లు అంశంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం ఆందోళన చేపట్టారు. రాష్ట్ర సచివాలయం ఎదుట ధాన్యం పోసి తమ పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలియజేశారు. అయితే, కవితతోపాటు ఆ పార్టీ శ్రేణులను అరెస్టు చేసిన పోలీసులు ఫలక్‌నుమ పోలీసుస్టేషన్‌కు తరలించారు. దాదాపు రెండు గంటల తర్వాత సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. నిరసన సమయంలో సచివాలయం వద్ద, ఆ తర్వాత పోలీసు స్టేషన్ వద్ద కవిత మాట్లాడారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదనే విషయాన్ని ముఖ్యమంత్రి గ్రహించి వెంటనే వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించాలని అన్నారు. రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను తరుగు లేకుండా కొనుగోలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. గ్రేడ్ ఏ వరిని గ్రేడ్ బీగా రిజిస్టర్ చేస్తున్నారని, యూరియా కోసం ఇబ్బంది పడే పరిస్థితులను ప్రభుత్వం పరిష్కరించాలని కవిత ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.