బీసీల రిజర్వేషన్ల కోసం ఆగస్టు 6న సభ
ABN , Publish Date - Jul 07 , 2026 | 04:42 AM
సమాజంలోని అన్నివర్గాల వారిని ఒక్కతాటిపైకి తీసువచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడతామని, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు...
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): సమాజంలోని అన్నివర్గాల వారిని ఒక్కతాటిపైకి తీసువచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడతామని, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు ఆగస్టు 6న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని టీఆర్‌ఎస్ (తెలంగాణ రక్షణ ేసన) అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. టీఆర్‌ఎస్ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ బీసీనాయకుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సామాజిక న్యాయ తెలంగాణ సాధన సభ’’ పేరుతో వచ్చే నెల 6న హైదారాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ‘‘మనమెంతో మనకంత’’ అనే నినాదం సాకారం కావాలంటే అన్ని వర్గాలను కలుపుకొని 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమాలు చేద్దామని కవిత పిలుపునిచ్చారు.