Share News

సింగరేణి, ఆర్టీసీ కార్మికులపై కర్కశ వైఖరి: కవిత

ABN , Publish Date - May 29 , 2026 | 03:56 AM

సింగరేణి, ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి కర్కశంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రక్షణ ేసన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

సింగరేణి, ఆర్టీసీ కార్మికులపై కర్కశ వైఖరి: కవిత

హైదరాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): సింగరేణి, ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి కర్కశంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రక్షణ ేసన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సింగరేణిలో కార్మికుల చెమట, రక్తాన్ని పీల్చి మరీ దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మాజీ మంత్రి బోడజనార్దన్‌ తన అనుచరులతో కలిసి టీఆర్‌ఎ్‌సలో చేరారు. గురువారం ఆ పార్టీ కార్యాలయంలో కవిత వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక మనం డిపెండెంట్‌ ఉద్యోగాలు సాధించుకున్నామని, కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని పొగొట్టే పనిచేస్తోందన్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న బోడ జనార్దన్‌ చేరికతో తమ పార్టీకి బలం చేకూరిందన్నారు.కార్మికశాఖ మంత్రిగా, ఆర్టీసీ ఛైర్మన్‌గా పనిచేసిన ఆయన... సింగరేణి, ఆర్టీసీ కార్మికులకోసం ఎంతో కృషి చేశారని చెప్పారు.

Updated Date - May 29 , 2026 | 03:56 AM