తెలంగాణ యువతను దగా చేసిన రాహుల్
ABN , Publish Date - Mar 03 , 2026 | 03:21 AM
రాష్ట్ర యువతను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పచ్చిగా మోసగించారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపణ
హైదరాబాద్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర యువతను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పచ్చిగా మోసగించారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అధికారంలోకి వస్తే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అడిగితే పోలీసులతో అణచివేస్తారా? అని సోమవారం ఓ ప్రకటనలో మండి పడ్డారు. ‘యువత ఆకాంక్షలు చిదిమేశారు. యూత్ డిక్లరేషన్‌ను బోగస్ చేశారు. జాబ్ క్యాలండర్ పత్తా లేదు. కాంగ్రెస్ అంటేనే మోసం.. వంచన అని మరోసారి నిరూపించుకున్నారు’ అని తెలిపారు. రాహుల్‌ను అడ్డుకుంటారన్న నెపంతో ముందస్తుగా నిరుద్యోగులను అరెస్టు చేయడం దుర్మార్గమన్న కవిత.. వెంటనే 2 లక్షల ఉద్యోగాలివ్వక పోతే కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులు కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు.