Share News

ఉద్యమకారులకు పథకాలు అందించాలి

ABN , Publish Date - May 11 , 2026 | 06:31 AM

తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్‌ ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చాలని, జార్ఖండ్‌ తరహాలో..

ఉద్యమకారులకు పథకాలు అందించాలి

  • జూన్‌ 2లోపు హామీలు అమలు చేయాలి: కవిత

హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్‌ ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చాలని, జార్ఖండ్‌ తరహాలో.. రాష్ట్రసర్కార్‌ సంక్షేమ పథకాలు అందించాలని తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. బంజారాహిల్స్‌లోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఆదివారం ఉద్యమకారులకు చెందిన పలు సంఘాల ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లను పరిష్కరించాలని, జూన్‌2లోపు హామీలు నెరవేర్చకపోతే ఉద్యమకారులతో కలిసి కాంగ్రెస్‌ సర్కార్‌పై ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామన్నారు. హామీల అమలు కోసం ఒత్తిడి పెంచేందుకు భువనగిరిలో సభ నిర్వహించాలన్నారు. భూపోరాటాలు ఉధృతం చేయాలని, జిల్లాల వారీగా ఉద్యమకారులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. సమావేశం అనంతరం ఉద్యమకారులతో కలిసి కవిత సహపంక్తి భోజనం చేశారు.

Updated Date - May 11 , 2026 | 06:31 AM