నన్నే అన్నా.. అంటావా..?!
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:53 AM
హెయిర్ సెలూన్ నిర్వాహ కుడిపై దాడి చేసిన కరీంనగర్ త్రీటౌన్ ఎస్‌ఐ చైతన్యచందర్‌ను ఉన్నతాధి కారులు సస్పెండ్ చేశారు. ఎస్‌ఐ చైతన్యచందర్..
సెలూన్ నిర్వాహకుడిపై చేయి చేసుకున్న ఎస్‌ఐ.. సస్పెన్షన్
కరీంనగర్ క్రైం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): హెయిర్ సెలూన్ నిర్వాహ కుడిపై దాడి చేసిన కరీంనగర్ త్రీటౌన్ ఎస్‌ఐ చైతన్యచందర్‌ను ఉన్నతాధి కారులు సస్పెండ్ చేశారు. ఎస్‌ఐ చైతన్యచందర్.. శనివారం ఉదయం నగరంలోని ఖాన్‌పురలోని న్యూ ప్రజా హెయిర్ స్టైల్ సెలూన్‌లోకి వెళ్లాడు. తనకు కటింగ్ చేయాలని నిర్వాహకుడు పడాల రాములును కోరాడు. ఇప్పుడే షాపు తెరిచానని, కొద్దిసేపు ఆగండి అన్నా... అని రాములు సమాధానం చెప్పాడు. నన్ను అన్నా అని అంటావా... వేచి ఉండమంటావా.. అంటూ అతడిని దూషిస్తూ ఆగ్రహంతో ఎస్‌ఐ చైతన్యచందర్ అతడిపై చేయి చేసుకున్నాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి ఎస్‌ఐని సస్పెండ్ చేశారు.