ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి
ABN , Publish Date - Feb 16 , 2026 | 02:21 AM
మునిసిపల్ కార్పొరేషన్లలో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివా్‌సతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
కరీంనగర్‌లో బీజేపీకి మెజారిటే లేదు
కాంగ్రెస్ నుంచి మేయర్ కావాలనుకుంటున్నాం: పొన్నం
వేములవాడ టౌన్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ కార్పొరేషన్లలో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివా్‌సతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో తామే గెలిచామని బండి సంజయ్ ప్రకటించుకున్నారని.. బీజేపీ నుంచి 30మంది కార్పొరేటర్లుగా గెలిస్తే మేయర్ పదవి ఎలా దక్కుతుందని ప్రశ్నించారు. కరీంనగర్‌లో 66 కార్పొరేటర్ స్థానాలు ఉన్నాయని, ఎక్స్ అఫీషియో సభ్యులుగా స్థానిక ఎమ్మెల్యే, మానకొండూరు ఎమ్మెల్యే, ఎంపీలతో కలిపి ఆ సంఖ్య 69కి చేరుతుందని, అలాంటప్పుడు బీజేపీకి మెజారిటీ ఎలా వస్తుందని నిలదీశారు. రాజకీయపార్టీగా కాంగ్రెస్‌కు చెందిన వారే మేయర్ కావాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. గతంలో తాము 13సీట్లు గెలిచినపుడు కరీంనగర్‌లో మేయర్ పదవిని దక్కించుకున్నామని, ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీల సూచనల మేరకు వ్యవహరిస్తామని చెప్పారు.