రెండేళ్లుగా యూపీఐ ద్వారా 2.37లక్షల లంచం!
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:49 AM
కాంట్రాక్టర్ల నుంచి రెండేళ్లుగా యూపీఐ ద్వారా రూ.2,37,500 లంచంగా తీసుకున్న కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ...
సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ
కరీంనగర్ క్రైం, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టర్ల నుంచి రెండేళ్లుగా యూపీఐ ద్వారా రూ.2,37,500 లంచంగా తీసుకున్న కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రాధికను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. గత ఏడాది బాధితుల నుంచి అందిన ఫిర్యాదులపై విచారణ చేపట్టిన ఏసీబీ.. బుధవారం ఆమెను అదుపులోకి తీసుకుంది. కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాధిక.. నిత్యావసర వస్తువులను సరఫరా చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేటప్పుడు కమీషన్ డిమాండ్ చేసేవారు. ఆ డబ్బులను తన కుటుంబ సభ్యులకు చెందిన ఖాతాలకు యూపీఐ ద్వారా బదిలీ చేయించుకునేవారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ.. బుధవారం ఆమెను అరెస్టు చేసింది.