Share News

kumaram bheem asifabad-ఆత్మరక్షణకు కరాటే దోహదం

ABN , Publish Date - Nov 22 , 2026 | 09:50 PM

ఆత్మ రక్షణకు కరాటే ఎంతగానో దోహద పడుతుందని ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. సన్నీ సెల్ప్‌ డిఫెన్స్‌ అకాడమి ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ 7వ జాతీయ స్థాయి ఓపెన్‌ టు ఆల్‌ స్టైల్‌ కరాటే కుంగ్‌ఫూ ఛాంపియన్‌షిప్‌ 2026 పోటీలను ఆమె ప్రారంభించారు.

kumaram bheem asifabad-ఆత్మరక్షణకు కరాటే దోహదం
మాట్లాడుతున్న ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆత్మ రక్షణకు కరాటే ఎంతగానో దోహద పడుతుందని ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. సన్నీ సెల్ప్‌ డిఫెన్స్‌ అకాడమి ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ 7వ జాతీయ స్థాయి ఓపెన్‌ టు ఆల్‌ స్టైల్‌ కరాటే కుంగ్‌ఫూ ఛాంపియన్‌షిప్‌ 2026 పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమిశిక్షణ, పట్టుదల, ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించటంలో ఇటువంటి జాతీయ స్థాయి పోటీలు ఎంతగానో దోహదపడుతాయని అన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఒకే వేదికపై కలుసుకోవడం ద్వారా క్రీడా స్పూర్తి, స్నేహ భావం పెంపొందుతాయని తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రం వేదిక కావడంతో స్థానికంగా క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొందని చెప్పారు. విద్యార్థులు తమ ప్రతిభను జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. జాతీయ క్రీడా స్థాయి పోటీల్లో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాష్‌, వైస్‌ చైర్మన్‌ అహ్మద్‌, గ్రాండ్‌ మాస్టర్‌ ఫౌండర్‌ కాంతేశ్వర్‌, అధ్యక్షుడు మోహన్‌, జనరల్‌ సెక్రటరి ఆర్‌.శ్రీనివాస్‌, ఛైర్మన్‌ భూమయ్య, టోర్నమెంటు చీఫ్‌ ఆర్గనైజర్‌ శ్రావణ్‌, సంతోష్‌, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌ రూరల్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ఆసిఫ్‌ అవర్‌ మోడల్‌ స్కూల్‌లో ఆదివారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు స్పందన లభించింది. జాబ్‌మేళా ఆసిఫాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మెంగ్రో ఆకాష్‌, వైస్‌ చైర్మన్‌ అహ్మద్‌లతో కలిసి ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమని చెప్పారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వెనుకబడి ప్రాంతంలో జాబ్‌మేళా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇది నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నిర్వహకలు మాట్లాడుతూ ఈ మేళాలో 40 ప్రముఖ కంపెనీలు పాల్గొని 2000 ఉద్యోగాలను భర్తీ చేశాయని వివరించారు. యశోద ఫౌండేషన్‌, అపోల్‌ హాస్పిటల్స్‌, మెడ్‌ప్లస్‌, టాటా, మహీంద్రా, సాహితి సిస్టమ్స్‌ వంటి కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యులు నిర్వహించారని తెలి పారు. కార్యక్రమంలో నిర్వహకులు సురేష్‌, ఆయూబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2026 | 09:50 PM