kumaram bheem asifabad- పర్వతారోహణలో కన్నీబాయి ఘనత
ABN , Publish Date - Jul 24 , 2026 | 11:25 PM
పర్వతారోహణ, సాహస క్రీడల్లో కెరమెరి మండలం భీమన్‌గొంది గ్రామానికి చెందిన కన్నీబాయి అసాధారణ ప్రతిభ చాటి ఎన్నో ఘనతలు సాఽధించారు. తాజాగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రకు ఎంపిక కావడం విశేషం. సాహస క్రీడల్లో ఎంతో దైర్యంతో ముందడుగు వేస్తున్న కన్నీబాయి గత ఏడాది ఉత్తరాఖంఢ్‌లోని 14,700 ఫీట్ల ఎత్తు ఉన్న వంగర్బుల్లా పర్వ శిఖరాన్ని అధిరోహించి అభినందనలు అందుకున్నారు. గిరిజన కుటుంబంలో పుట్టిన ఆమె ఆర్థిక కష్ఠాలు ఎదురైనా చిన్నప్పటి నుంచి ఆటల్లో ప్రతిభ చాటి పలువురి నుంచి ప్రశంసలు అందుకున్నారు.
ఇటీవల ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రకు ఎంపిక
కెరమెరి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): పర్వతారోహణ, సాహస క్రీడల్లో కెరమెరి మండలం భీమన్‌గొంది గ్రామానికి చెందిన కన్నీబాయి అసాధారణ ప్రతిభ చాటి ఎన్నో ఘనతలు సాఽధించారు. తాజాగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రకు ఎంపిక కావడం విశేషం. సాహస క్రీడల్లో ఎంతో దైర్యంతో ముందడుగు వేస్తున్న కన్నీబాయి గత ఏడాది ఉత్తరాఖంఢ్‌లోని 14,700 ఫీట్ల ఎత్తు ఉన్న వంగర్బుల్లా పర్వ శిఖరాన్ని అధిరోహించి అభినందనలు అందుకున్నారు. గిరిజన కుటుంబంలో పుట్టిన ఆమె ఆర్థిక కష్ఠాలు ఎదురైనా చిన్నప్పటి నుంచి ఆటల్లో ప్రతిభ చాటి పలువురి నుంచి ప్రశంసలు అందుకున్నారు.
తొమ్మిది రోజులు..
ఉత్తరాఖంఢ్‌లోని 14,700 ఫీట్ల ఎత్తులోని పర్వతాన్ని ఎక్కడానికి తొమ్మిది రోజుల సమయం పట్టింది. ఈ ప్రయాణంలో కొంత మంది అనారోగ్యం బారినపడినా కూడా ఏ మాత్రం జంకకుండా పర్వతం ఎక్కిన తర్వాత జాతీయ జెండాను ఆవిష్కరించడంతో కన్నీబాయి ఘనత దేశ వ్యాప్తంగా మారు మోగింది. గిరిజన బిడ్డకు ఇంతటి ప్రతిభ ఉండడంపై పలువురు అభినందించారు. కన్నీబాయిని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా సన్మానించింది. అలాగే అప్పటి సీఎం కార్యాలయం ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్, కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి ఘనంగా శాలువాలతో కన్నీ బాయిని సన్మానించారు. సాహస క్రీడల్లో కన్నీబాయి ఇప్పటి వరకు ఎన్నో విజయాలను సొంతం చేసుకుని అభినందనలు అందుకున్నారు.
2019లో భగీరథ-2 పర్వతా అఽధిరోహించి బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకుని అందరి మన్ననలు పొందారు. 2020 జనవరి 7న ఆంధ్రప్రదేశ్‌లోని అరుకులోయల గల కటిక జల పాతంలో వాటర్ రాపెల్లింగ్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారుల ప్రపంచ్ కప్ ట్రోఫీ గెలుచుకున్నారు. మడావి కన్నీబాయి ఆధ్వర్యంలో సాహస క్రీడల్లో పాల్గొన్న 17 మంది క్రీడాకారులు కూడా వివిఽధ విభాగాల్లో పతకాలు సాధించారు. ప్రస్తుతం కన్నీ బాయి అడ్వెంచర్ క్లబ్ బ్రాండ్ అంబా సిడర్‌గా కొనసా గుతుండడం విశే షం. కానీ జాగా ఎవరెస్ట్ పర్వ తం ఎ క్కేందుకు సన్నద్ధ మవుతున్నారు.