Kamal Devi : కమలాదేవి ఆదర్శనీయురాలు
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:14 AM
పేద ప్రజలను ఏకం చేసి భూస్వాములపై సాయుధ పోరాటం చేసిన ఆలేరు అగ్గిరవ్వ ఆరుట్ల కమలాదేవి ఆదర్శనీయురాలని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి అన్నా రు.
సీపీఐ జిల్లా కార్యదర్శి దామోదర్‌రెడ్డి
ఆలేరు రూరల్,జనవరి 1 (ఆంధ్రజ్యోతి): పేద ప్రజలను ఏకం చేసి భూస్వాములపై సాయుధ పోరాటం చేసిన ఆలేరు అగ్గిరవ్వ ఆరుట్ల కమలాదేవి ఆదర్శనీయురాలని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి అన్నా రు. గురువారం మండలంలోని కొలనుపాకలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మొదటి మహిళా శాసనసభా పక్షనేత డాక్టర్ కమలాదేవి వర్థంతి సభను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని స్తూపం వద్ద పూలమాలలు వేసి విప్లవాభివందనాలు తెలిపారు. ఈ సందర్భంగా దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ 1952 నుంచి ఆలేరు నుంచి మూడుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడారన్నారు. ఆరుట్ల రాంచంద్రారెడ్డి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని సాయుధ పోరాటం చేసి వీరనారిగా నిలిచారన్నారు. మహిళలకు విద్యను అందించేందుకు పాఠశాలలను ఏర్పాటు చేసిన ఉద్యమ ఉపాధ్యాయురాలు అని కొనియాడారు. అధికార కాంగ్రెస్ ప్రభు త్వం ట్యాంక్‌బండ్‌పై ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, పాఠ్యపుస్తకాల్లో ఆమె జీవిత గాథను చేర్చాలన్నారు. కార్యక్రమంలో నాయకులు చెక్క వెంకటేష్, బొలగాని సత్యనారా యణ, కళ్లెం కృష్ణ, రాజయ్య, కనకయ్య, మహేందర్, జానమ్మ, సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ, ఉపసర్పంచ్ విజయేందర్‌రెడ్డి, నర్సింహులు, ఆంజనేయులు, అయిలయ్య, సుశీలాదేవి, మమత పాల్గొన్నారు.