kumaram bheem asifabad- ‘కల్యాణలక్ష్మి’ పేదలకు వరం
ABN , Publish Date - Jan 14 , 2026 | 10:20 PM
ప్రభుత్వం అమలు చేసున్న షాదీముబారక్, కల్యాణ లక్ష్మి పథకం పేదలకు వరమని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. స్థానిక ఎంపీ డీవో కార్యాలయంలో సర్పంచ్ కొడప ప్రకాష్ అధ్యక్షతన బుధవారం జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాలకు చెందిన 115 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
జైనూర్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అమలు చేసున్న షాదీముబారక్, కల్యాణ లక్ష్మి పథకం పేదలకు వరమని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. స్థానిక ఎంపీ డీవో కార్యాలయంలో సర్పంచ్ కొడప ప్రకాష్ అధ్యక్షతన బుధవారం జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాలకు చెందిన 115 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ షాదీముబారక్, కల్యాణ లక్ష్మి పథకం పేద ఆడ పడచులు పెళ్లిళ్లకు ఇబ్బందులు పడకూడదని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అమలు చేశారని చెప్పారు. ఈ పథకం పేదలకు ఎంతో లాభదాయకంగా ఉందని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం దీన్ని కొనసాగించడం అభినందనీయమని తెలిపారు. అంతకు ముందు మండలంలోని పొలాస, కాలేజీగూడ, జైనూర్ నుంచి సుమారు 50 మంది ఎమ్మెల్యే కోవ లక్ష్మి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి కోవ లక్ష్మి ఆహ్వానించారు. బీఆర్‌ఎస్ పార్టీ గ్రామీణ ప్రాంత నాయకులను గుర్తిస్తుం దని, పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మండల కేంద్రంలో నాలుగు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందిన కాంట్రాక్టర్, సమాజ సేవకుడు సదర్ ఫాజిల్ బియాబాని కుటుంబ సభ్యులను పరామర్శించారు. జామ్నిలో తెలంగాణ ఉద్యమ సీనియర్ నాయకుడి తల్లి ఇటీవల మృతి చెందడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్‌రావ్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఇంతి యాజ్‌లాల మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైరన్ కనక యాదవ్‌రావ్, మాజీ సహకార చైర్మన్ కొడప హన్ను పటేల్, మాజీ వైస్ ఎంపీపీ చిర్లె లక్ష్మణ్, మాజీ సర్పంచ్ మర్సుకోల సరస్వతి, సీనియర్ నాయకుడు మేస్రాం అంబాజీ, ఎంపీటీసీల ఫోరం మాజీ చైర్మన్ కుంర భగ్వంత్‌రావ్, మాజీ జడ్పీటీసీ అడె లక్యానాయక్ మాజీ మార్కెట్ డైరెక్టర్ గాడాం లక్ష్మణ్, సర్పంచ్‌లు మడావి కౌసల్యబాయి, మడావి మనోహర్, మడావి సోంబాయి, కుంర భీంరావ్, భావరావ్, మాజీ సర్పంచ్‌లు మడావి భీంరావ్, మడావి నాగోరావ్, ఆత్రం జాలీంషా, ఉప సర్పంచ్ డింద్రే సమాధాన్, నాయకులు ముండె సతీష్, కెంద్రే విశాల్, కరాడ్ ఉద్దవ్, సోనకాంబ్లే విశ్వనాథ్, కాంబ్లే బబృవాన్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.