Kalvakuntla Kavitha Urges: కర్ల రాజేశ్ కుటుంబానికి న్యాయం చేయండి
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:52 AM
పోలీస్ కస్టడీలో మృతి చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ కుటుంబానికి న్యాయం చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీని ఎక్స్ వేదికగా కోరిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జనవరి 18(ఆంధ్రజ్యోతి): పోలీస్ కస్టడీలో మృతి చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ కుటుంబానికి న్యాయం చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో దళితులపై దారుణాలు జరుగుతున్నాయని, ఇటువైపు కొంచెం చూడాలని ఎక్స్ వేదికగా కోరారు. అధికారం చేపట్టి రెండేళ్లైనా రోహిత్ వేముల చట్టాన్ని ప్రవేశపెట్టలేదని, దానికి ఎంత సమయం పడుతుందో చెప్పాలన్నారు. దళితులపై ప్రేమను మాటల ద్వారా కాకుండా చేతల్లో చూపించాలని ఆమె పేర్కొన్నారు.