Share News

ఒవైసీ బ్రదర్స్‌ పొద్దుతిరుగుడు పువ్వులాంటోళ్లు

ABN , Publish Date - Feb 11 , 2026 | 02:41 AM

తెలంగాణ ఏర్పడ్డాక.. కేసీఆర్‌తో కలిసి అధికారంలో పాలు పంచుకున్నారు.. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రె్‌సతో జతకట్టారు.

ఒవైసీ బ్రదర్స్‌ పొద్దుతిరుగుడు పువ్వులాంటోళ్లు

  • అధికారంలో ఉన్న వారిచుట్టూ తిరుగుతారు: కవిత

హైదరాబాద్‌, పిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ ఏర్పడ్డాక.. కేసీఆర్‌తో కలిసి అధికారంలో పాలు పంచుకున్నారు.. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రె్‌సతో జతకట్టారు. ఒవైసీ సోదరులు పొద్దుతిరుగుడు పువ్వుల్లాంటోళ్లు. అధికారంలో ఎవరుంటే వారిచుట్టూ తిరుగుతారు’’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. రాహుల్‌ గాంధీ.. కేంద్రంలో ఒవైసీలను వ్యతిరేకిస్తారని, ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం వారితో దోస్తానా చేస్తారని, అందుకే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ కోసమే ఎంఐఎం అభ్యర్థిని పెట్టలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనార్టీ వర్గాలకు కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించలేదని, అయినప్పటీ ఒవైసీ సోదరులు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని విమర్శించారు. గతంలో రాయల తెలంగాణ అని తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎం నేతలు అన్ని ప్రభు త్వాలతో అంటకాగుతున్నప్పటికీ.. పాతబస్తీ ప్రగతిపై దృష్టి పెట్టడంలేదని ఆరోపించారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో 123 మునిసిపాలిటీలుండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సిద్దిపేట మునిసిపాలిటీకి మాత్రమే అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ మంజూరు చేసిందన్నారు. దీన్నిబట్టిచూస్తే.. అక్కడి ముఖ్యనేతకు సీఎంకు మధ్య ఉన్న స్నేహం బహిర్గతం అవుతోందని, ఏ ప్రభుత్వం ఉన్నా.. ఆ నేతకు మాత్రం పనులవుతున్నాయని ఆరోపించారు. ఈ నెల12న జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభను చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు.

Updated Date - Feb 11 , 2026 | 02:41 AM