రేవంత్ రెడ్డి అడగలేదు.. బీఆర్‌ఎస్ ప్రశ్నించలేదు
ABN , Publish Date - May 14 , 2026 | 04:37 AM
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయంలో సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి లేదని, దీనిపై ప్రశ్నించాల్సిన బీఆర్‌ఎస్ మౌనంగా .....
పాలమూరుకు జాతీయ హోదాపై మాట్లాడని ప్రధాని
వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయంలో సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి లేదని, దీనిపై ప్రశ్నించాల్సిన బీఆర్‌ఎస్ మౌనంగా ఉందని టీఆర్‌ఎస్ అధ్యక్షురాలుకవిత విమర్శించారు. ప్రధాని మోదీని రేవంత్‌రెడ్డి అడగలేదు.. బీఆర్‌ఎస్ ప్రశ్నించలేదంటూ ఎద్దేవాచేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మోదీ పర్యటనలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటిస్తారని భావించినప్పటికీ.. మొండిచేయి చూపారన్నారు. మనకు పొదుపు సూత్రాలు చెప్పి.. ఆంధ్రాకు పైసలిచ్చి వెళ్లిపోయారని మండిపడ్డారు. ప్రధాని పర్యటనలో తెలంగాణకు ఏం ఇవ్వకపోయినా ప్రధాన ప్రతిపక్షం ఎందుకు స్పందించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధికారం చేపడుతుందన్నారు. కాగా.. పది రూపాయల డైపర్ కూడా లీక్ కావడంలేదని, అలాంటిది నీట్ పేపర్ ఎలా లీక్ అవుతుందని ప్రశ్నించిన కవిత.. విద్యార్థుల భవిష్యత్తును ఇబ్బంది పెట్టేలా కేంద్రం చర్యలున్నాయని విమర్శించారు.