Share News

గిరిజన జాతరపై బీజేపీకి గౌరవం లేదా?: కవిత

ABN , Publish Date - Jan 31 , 2026 | 04:37 AM

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరపై బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదా? అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.

గిరిజన జాతరపై బీజేపీకి గౌరవం లేదా?: కవిత

వరంగల్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరపై బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదా? అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. శుక్రవారం మేడారం సమ్మక్క- సారలమ్మలను ఆమె దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఇంత పెద్ద సంఖ్యలో జరిగే జాతరకు జాతీయ హోదా ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. జాతరకు వచ్చే మహిళా భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. జాతరలో నెలకొన్న సమస్యలపై భవిష్యత్‌లో పోరాటాలు కూడా చేస్తామని స్పష్టం చేశారు. అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

Updated Date - Jan 31 , 2026 | 04:37 AM