Share News

తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజీ

ABN , Publish Date - Sep 09 , 2026 | 11:23 PM

తెలంగాణ గర్వించదగ్గ మ హా నీయుడు కాళోజీ నారాయణరావు అని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నా రు. బుధవారం కలెక్టరేట్‌ భవన సమావేశ మంది రం లో నిర్వహించిన కాళోజీ జయంతి వేడు కల్లో ఆయన పాల్గొన్నారు.

తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజీ
నివాళులు అర్పిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ గర్వించదగ్గ మ హా నీయుడు కాళోజీ నారాయణరావు అని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నా రు. బుధవారం కలెక్టరేట్‌ భవన సమావేశ మంది రం లో నిర్వహించిన కాళోజీ జయంతి వేడు కల్లో ఆయన పాల్గొన్నారు. కాళోజీ చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమం ప్రతి ధ్వని గా కాళోజీ నారాయణ రావు తెలంగాణ ప్రజ లందరికీ సుపరిచితులన్నారు. తెలంగాణ వై తాళికునిగా జీవి తాన్ని అంకితం చేసిన మహనీయుడన్నారు. ప్రభుత్వం కాళోజీ జయం తిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వ హించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కా ర్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు చంద్రయ్య, రాములు, రెవెన్యూ అధికారి మోతిరాం, ట్రైనీ డిప్యూటి కలెక్టర్‌ విలాయత్‌ అలీ, కలెక్టరట్‌ పరిపాలన అధికారి శ్రీనివాష్‌రావుదేశ్‌పాండే పాల్గొన్నారు.

ఫ సాహితి సంరక్షణ సమితి ఆధ్వర్యంలో బుధ వారం కాళోజీ నారాయణ జయంతిని ఘనంగా నిర్వ హించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ని వాళులర్పించారు. కార్యక్రమంలో సమితి ప్రధాన కార్య దర్శి అల్లాడి శ్రీనివాస్‌, నాయకులు సుగు ణాకర్‌, వామ న్‌రావు, గణేష్‌, సుజాత పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో నవతరం స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో కాళోజీ జయంతిని ఘనంగా నిర్వహించారు.

ప్రజల పక్షాల నిలిచిన కాళోజీ...

మంచిర్యాల క్రైం : ప్రజా కవి కాళోజీ తన రచనల ద్వారా ప్రజల పక్షాన నిలిచారని సీపీ అంబర్‌ కిషోర్‌ ఝూ అన్నారు. కమి షనరేట్‌ కార్యాలయంలో కాళోజీ నారాయ ణరావు 112 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నా గొడవ వంటి రచనలు ఆయన ప్రజా చైతన్యానికి ప్రతీకలుగా నిలి చాయన్నారు. ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్‌ పతకాలను సత్కరించిందన్నారు. ఆయన ఆశయాల స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు.

Updated Date - Sep 09 , 2026 | 11:23 PM