కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు
ABN , Publish Date - Sep 05 , 2026 | 11:58 PM
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని చెన్నూరు ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం జైపూర్ మండలంలో సంబరాలను నిర్వహిం చారు.
మంత్రి వివేక్‌వెంకటస్వామి
జైపూర్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని చెన్నూరు ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం జైపూర్ మండలంలో సంబరాలను నిర్వహిం చారు. ఇందారం గ్రామం నుంచి జైపూర్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆయన మా ట్లాడుతూ కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కాళేశ్వరం ఎందుకు కుంగిపో యిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అపోజిష న్ లీడర్‌గా జీతాలు తీసుకుంటున్నాడని, కానీ ప్రజల సమస్యలపై అ సెంబ్లీకి వచ్చి మాట్లాడడం లేదన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి అయినా రా వాలి లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభు త్వ హయాంలో పదేళ్లలో ఒక్క గనిని తీసుకురాలేదని, తాను ఎమ్మెల్యే అయినా ఆర్కేపీలో ఓసీపీ గనిని తీసుకువచ్చానన్నారు. జైపూర్ పవర్ ప్లాంట్‌లో అదనంగా 1200 మెగావాట్ల పవర్ ప్లాంట్ పనులు కొనసా గుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ర ఘునాథ్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చల్ల విశ్వంభర్‌రెడ్డి, నాయ కులు రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, ముక్త శ్రీనివాస్, సంపత్‌రెడ్డి, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.