Share News

లక్షల కోట్లతో కట్టింది కాళేశ్వరం కాదు కూలేశ్వరం

ABN , Publish Date - Jul 06 , 2026 | 11:19 PM

లక్షల కోట్ల రూపాయలతో కేసీఆర్‌ కట్టింది కాలేశ్వరం కాదని కూలేశ్వరం, నిర్మాణం చేసిన మూడు సంవత్సరాలకే పగుళ్లు తేలిన ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది కాళేశ్వరమేనని రాష్ట్ర గనుల, కార్మిక శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి తెలిపారు.

లక్షల కోట్లతో కట్టింది కాళేశ్వరం కాదు కూలేశ్వరం
మాట్లాడుతున్న మంత్రి వివేక్‌వెంకటస్వామి

మంత్రి వివేక్‌వెంకటస్వామి

మందమర్రిటౌన్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి) : లక్షల కోట్ల రూపాయలతో కేసీఆర్‌ కట్టింది కాలేశ్వరం కాదని కూలేశ్వరం, నిర్మాణం చేసిన మూడు సంవత్సరాలకే పగుళ్లు తేలిన ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది కాళేశ్వరమేనని రాష్ట్ర గనుల, కార్మిక శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి తెలిపారు. సోమ వారం మందమర్రిలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మె ల్యే హరీష్‌రావు కొత్త డ్రామాలు ఆడుతున్నారని, ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. కేసీఆర్‌ కుటుంబం లక్షల కోట్ల రూపాయలను దండుకుందని, ఆ డబ్బుల కోసం కూతురు కవిత ప్రశ్నిస్తుంటే వారి వద్ద సమాధానం లేదన్నారు. కేటీఆర్‌ ఒక ఫెయిల్యూర్‌ లీడర్‌ అని పేర్కొన్నారు. సింగరేణిని కూడా బీఆర్‌ఎస్‌ కోలుకోలేని దెబ్బతీసిం దని, సింగరేణి నిధులను దారి మళ్లించింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని పేర్కొ న్నారు. సింగరేణికి బొగ్గుగనులను దక్కించుకోవడానికి వేలం పాటలో పా ల్గొనడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామన్నారు. సింగరేణిలో పనిచే స్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచడానికి ప్రణాళికలు రూపొంది స్తున్నామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి విజన్‌ ఉన్న లీడర్‌ అని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ఆందోలనలు చేస్తున్నా ప్రజలు ఎవరు రావడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ సింగరేణి ఆస్తులు ధ్వంసం చేయాలని పిలుపునిస్తే హరీష్‌రావు, కేటీఆర్‌ ఏం చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్‌ విమర్శలు మానుకోవాలన్నారు. కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

-కుటుంబాలకు పరామర్శ

పట్టణంలోని రెండవ జోన్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు ముజాయిద్‌ తండ్రి అనారోగ్యంతో మృతిచెందగా ఆయనను మంత్రి వివేక్‌వెంకటస్వామి పరామర్శించారు. మూడవ జోన్‌కు చెందిన కుంబం రాజు రోడ్డు ప్రమాదం లో మృతిచెందగా ఆయన కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు.

Updated Date - Jul 06 , 2026 | 11:19 PM