ప్రజల సంక్షేమానికి కృషి చేసిన వ్యక్తి కాకా..
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:27 PM
ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేసిన వ్యక్తి కాకా వెంకటస్వామి అని కాంగ్రెస్ జిల్లా అధ్య క్షుడు రఘునాధ్‌రెడ్డి అన్నారు. మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకటస్వామి (కా కా) జయంతి వేడుకలను సోమవా రం పట్టణంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు.
మందమర్రిటౌన్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేసిన వ్యక్తి కాకా వెంకటస్వామి అని కాంగ్రెస్ జిల్లా అధ్య క్షుడు రఘునాధ్‌రెడ్డి అన్నారు. మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకటస్వామి (కా కా) జయంతి వేడుకలను సోమవా రం పట్టణంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కాకా చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. రఘునాధ్‌రెడ్డి హాజరై మా ట్లాడారు. దేశం గర్వించదగ్గ నాయకు డు కాకా వెంకటస్వామి అని తెలిపారు. అనంతరం సీఐఎస్‌ఎఫ్ బ్యారక్‌లో ఉచిత కోచింగ్ సెంట్‌లో అభ్యర్ధులకు చికెన్‌తో అన్న దాన కార్యక్రమం నిర్వహించారు. నా యకులు మంద తిరుమల్‌రెడ్డి, పైడి మల్ల నర్సింగ్, సొత్కు సుదర్శన్, ఉపేం దర్, ఇసాక్, నామిని ముత్తయ్య, పిండి విజయ్, శంకర్‌గౌడ్ పాల్గొన్నారు.
ఫకాకా వెంకటస్వామి ఆశయ సా ధనే లక్ష్యమని ఆయన తనయుడు రా ష్ట్ర కార్మిక ఉపాధికల్పన గనులశాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. సోమవారం కాకా జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాం క్‌బండ్ వద్ద కాకా విగ్రహానికి సహచర మంత్రులతో కలిసి నివాళులు ఆర్పిం చారు.
మంచిర్యాల కలెక్టరేట్: అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహ నీయుడు, కార్మిక పక్షాపతి వెంకట స్వా మి (కాకా) అని డీసీపీ భాస్కర్ పే ర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ భవ న సమావేశ మందిరంలో కాకా వెంక టస్వామి జయంతి వేడుకలను ఘనం గా నిర్వహించారు. ఆయన చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూ ల్డు కులల అభివృద్ధి అధికారి దుర్గాప్ర సాద్, డీఆర్ డీవో కిషన్, జిల్లా సంక్షే మాధికారి రౌఫ్‌ఖాన్,జిల్లా అల్ప సం ఖ్యాక వర్గాల సంక్షేమ అధికారి రాజే శ్వరి, కార్మిక శాఖ అధికారి క్రాంతి, అధి కారులు పాల్గొన్నారు.