Share News

kumaram bheem asifabad- కాగజ్‌నగర్‌ పట్టణాభివృద్ధికి పాటుపడాలి

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:10 PM

కాగజ్‌నగర్‌ పట్టణాభివృద్ధికి పాటుపడేలా బడ్జెట్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ షాహీన్‌ సుల్తానా అధ్యక్షతన శనివారం మున్సిపల్‌ బడ్జెట్‌ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండె విఠల్‌ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి బడ్జెట్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవాల, రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలనివ తెలిపారు. పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

kumaram bheem asifabad- కాగజ్‌నగర్‌ పట్టణాభివృద్ధికి పాటుపడాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ దండె విఠల్‌

కాగజ్‌నగర్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ పట్టణాభివృద్ధికి పాటుపడేలా బడ్జెట్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ షాహీన్‌ సుల్తానా అధ్యక్షతన శనివారం మున్సిపల్‌ బడ్జెట్‌ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండె విఠల్‌ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి బడ్జెట్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవాల, రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలనివ తెలిపారు. పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు మాట్లడుతూ పట్టణాభివృద్ధి బడ్జెట్‌ను సక్రమంగా వినియోగించుకోవాల న్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా చేయాలన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్‌ ఆదాయం రూ.52.49 కోట్లు కాగా వ్యయం రూ.52.49 కోట్లకు అమోదించేందుకు ప్రతిపాదించారు. కాగా మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ అనధికారికంగా ఉపయోగిస్తున్నారంటూ శనివారం కలెక్టర్‌, మున్సిపల్‌ కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు. అనధికార వ్యక్తులు చాంబర్‌లోకి ప్రవేశిస్తూ కార్యాలయ పనులకు ఆటంకం కలిగిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ అనిత, కౌన్సిలర్లు, కమిషనర్‌ తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2026 | 11:10 PM