Share News

కాంగ్రెస్‌ పాలన అస్తవ్యస్తం: ఎంపీ లక్ష్మణ్‌

ABN , Publish Date - Jul 08 , 2026 | 05:56 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన అస్తవ్యస్తంగా మారిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మండిపడ్డారు.

కాంగ్రెస్‌ పాలన అస్తవ్యస్తం: ఎంపీ లక్ష్మణ్‌

హైదరాబాద్‌, జులై 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన అస్తవ్యస్తంగా మారిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడచినా సీఎం రేవంత్‌.. పరిపాలనపై కనీస పట్టు సాధించలేకపోయారని అన్నారు. తన పదవిని కాపాడుకోవడం కోసం రేవంత్‌ ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో పాలన ఏ రకంగా పడకేసిందో చెప్పడానికి ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలే నిదర్శనమని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. 30 నెలల కాలంలో రికార్డు స్థాయిలో 24 సార్లు ఐఎఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టారని అన్నారు. రేవంత్‌, 71 సార్లు ఢిల్లీ పర్యటనలు చేయడాన్ని చూస్తుంటే తెలంగాణ పాలన సచివాలయం నుంచి జరుగుతోందా?లేక ఢిల్లీ నుంచి జరుగుతుందా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని విమర్శించారు.

Updated Date - Jul 08 , 2026 | 05:57 AM