తెలంగాణలో 27 కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలి
ABN , Publish Date - Mar 17 , 2026 | 05:04 AM
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని కొన్ని కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ కోరారు.
ఏపీలో 5 కులాలను కూడా..
కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ కె.లక్ష్మణ్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, మార్చి 16: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని కొన్ని కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో 27, ఏపీలో 5 కులాలు రాష్ట్రాల ఓబీసీ జాబితాలో ఉన్నాయని.. ఆయా కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని సుదీర్ఘకాలంగా కోరుతున్నారని తెలిపారు. జాతీయ బీసీ కమిషన్ ఇప్పటికే తెలంగాణ, ఏపీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లోని అనేక ఓబీసీ కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రధానంగా తెలంగాణలో 27, ఏపీలోని 5 కులాల వారు సామాజికంగా, ఆర్థికంగా వెనకబడి ఉన్నారని తెలిపారు. ఆయా కులాలను కేంద్ర జాబితాలో చేర్చి, న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.