Share News

డీలిమిటేషన్‌పై రేవంత్‌ విమర్శలు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే : లక్ష్మణ్‌

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:20 AM

డీలిమిటేషన్‌పై సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు.. కేవలం తన ప్రభుత్వ వైఫల్యాలను మరుగునపడేలా చేసేందుకేనని బీజేపీ ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ఆరోపించారు...

డీలిమిటేషన్‌పై రేవంత్‌ విమర్శలు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే : లక్ష్మణ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): డీలిమిటేషన్‌పై సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు.. కేవలం తన ప్రభుత్వ వైఫల్యాలను మరుగునపడేలా చేసేందుకేనని బీజేపీ ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. తెలంగాణకు ప్రాతినిధ్యం తగ్గుతుందనడం వాస్తవదూరమన్నారు. రేవంత్‌రెడ్డి తనపై చేసిన వ్యంగ్య, అసత్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తాను ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిని కాబట్టి తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటానని అనడం దురుద్దేశపూరితమన్నారు. తన సొంత రాష్ట్రంపై తన నిబద్థతను ప్రశ్నించలేరన్నారు. డీలిమిటేషన్‌ వంటి అంశాలను రాజ్యాంగం, జనాభా గణాంకాలు, నిపుణుల సూచనల ఆధారంగా నిర్ణయిస్తారు.. హైబ్రిడ్‌ మోడల్‌ పేరుతో రాజ్యాంగ విరుద్థమైన సూచనలు చేయడం కన్నా, సీఎం వాస్తవాలు తెలుసుకుని మాట్లాడటం మంచిదన్నారు. కేంద్రం పరిశీలిస్తున్న విధానం ప్రకారం సీట్ల పెంపు శాతం ఉత్తరాది, దక్షిణాది తేడా లేకుండా సమానంగా ఉంటుందని లక్ష్మణ్‌ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

Updated Date - Apr 15 , 2026 | 04:20 AM