Share News

హామీలపై సమాధానం చెప్పలేకే పలాయనం

ABN , Publish Date - Mar 03 , 2026 | 03:20 AM

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తెలంగాణకు వచ్చినా ఇక్కడి ప్రజలకు ముఖం చాటేసి దొడ్డిదారిన ఢిల్లీకి వెళ్లిపోయారని బీజేపీ ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విమర్శించారు.

హామీలపై సమాధానం చెప్పలేకే పలాయనం

  • రాహుల్‌ పర్యటన అసలు ఉద్దేశం.. తెలంగాణ లూటీ: కె.లక్ష్మణ్‌

హైదరాబాద్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి) : లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తెలంగాణకు వచ్చినా ఇక్కడి ప్రజలకు ముఖం చాటేసి దొడ్డిదారిన ఢిల్లీకి వెళ్లిపోయారని బీజేపీ ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు, హామీలపై సమాధానం చెప్పలేకే పలాయనం చిత్తగించారన్నారు. గత ఎన్నికల సమయంలో స్వయంగా రాహుల్‌గాంధీ సమక్షంలో రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు సహా అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలుకాలేదన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ చెప్తున్నట్లు రాహుల్‌ శిక్షణ శిబిరం కోసం రాలేదని, పర్యటన అసలుఉద్దేశం తెలంగాణ లూటీ అని ధ్వజమెత్తారు.

Updated Date - Mar 03 , 2026 | 03:20 AM