Share News

రాజ్యాధికారం, పెట్టుబడిదారులు కలిస్తే వచ్చేది ఫాసిజమే

ABN , Publish Date - Apr 10 , 2026 | 05:26 AM

రాజ్యాధికారం, బడా పెట్టుబడిదారులు కలిస్తే వచ్చేది ముస్సోలినీ ఫాసిజమేనని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి బి. సుదర్శన్‌ రెడ్డి విమర్శ పరోక్షంగా కేంద్రాన్ని విమర్శించారు.

రాజ్యాధికారం, పెట్టుబడిదారులు కలిస్తే వచ్చేది ఫాసిజమే

  • సుప్రీం రిటైర్డు జడ్జి బి. సుదర్శన్‌ రెడ్డి

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): రాజ్యాధికారం, బడా పెట్టుబడిదారులు కలిస్తే వచ్చేది ముస్సోలినీ ఫాసిజమేనని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి బి. సుదర్శన్‌ రెడ్డి విమర్శ పరోక్షంగా కేంద్రాన్ని విమర్శించారు. మౌలిక వసతుల అభివృద్ధి పేరుతో ప్రపంచీకరణను కొనసాగించే విధానాలు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని ఆక్షేపించారు. కార్పొరేట్లు అధికలాభాలు సముపార్జించడం, తిరిగి ఆ సొమ్మును అధికార వర్గాల మనుగడకు వెచ్చించడం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సామ్యవాద భావన భారత రాజ్యాంగంలోనే అంతర్లీనంగా నిక్షిప్తమై ఉందని, రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో ఆర్థిక ప్రజాస్వామ్యం ప్రధాన అంశంగా నిలిచిందన్నారు. అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం, చంచల్‌గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్థికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘‘ఆర్థిక సంస్కరణలు-భారత రాజ్యాంగం-విభేదాలు, వైరుధ్యా లు, పురోగతి’’ అంశంపై 2రోజుల జాతీయ సదస్సును సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రఖ్యాత మార్క్సిస్టు ఆర్థికవేత్త ప్రొ. ప్రభాత్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నాన్‌-కాంట్రిట్యూటరీ పెన్షన్‌ నెలకు రూ.200 మాత్రమే ఇస్తోందని, ఇది అత్యంత హాస్యాస్పదమైన పథకమని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఏఓయూ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి, అకడమిక్స్‌ డైరెక్టర్‌ ప్రొ. పుష్పా చక్రపాణి, కో-డైరెక్టర్‌ కృష్ణారెడ్డి, సెమినార్‌ డైరెక్టర్‌ ప్రొ. పట్టా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 05:26 AM