సైకిల్‌పై జూపల్లి ప్రచారం
ABN , Publish Date - Feb 08 , 2026 | 07:13 AM
‘ఆరోగ్యమే మహాభాగ్యం.. అందరూ మోటారు సైకిల్ వాహనాలను పక్కన పెట్టి వ్యాయామంలో...
కొల్లాపూర్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ‘ఆరోగ్యమే మహాభాగ్యం.. అందరూ మోటారు సైకిల్ వాహనాలను పక్కన పెట్టి వ్యాయామంలో భాగంగా రోజుకు 5 నుంచి 10 కిలోమీటర్ల మేరకు సైకిల్ తొక్కాలి’ అని రెండు రోజుల క్రితం ప్రజలకు పిలుపునిచ్చిన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.. చెప్పిన దానిని పాటించారు. శనివారం నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లోని ఐదవ వార్డులో మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సైకిల్‌పై తిరుగుతూ ప్రచారం చేశారు. ఓటర్లకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన మంత్రి సైకిల్ పర్యటన పలువురిని ఆకట్టుకున్నది.