Tragedy: ఇంజక్షన్‌లో గడ్డిమందు వేసుకుని జూనియర్ డాక్టర్ ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Jan 05 , 2026 | 03:01 AM
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ జూనియర్ డాక్టర్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన...
నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి
ఇంటర్న్‌షిప్, నీట్ పీజీ ప్రిపరేషన్ ఒత్తిడితోనే: కాలేజీ సిబ్బంది
సిద్దిపేట క్రైం/అర్బన్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ జూనియర్ డాక్టర్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన బి.లావణ్య సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్ పూర్తిచేసి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. శుక్రవారం ఉదయం విధుల్లో ఉండగా అస్వస్థతకు గురికావడంతో చికిత్స తీసుకొని కాలేజీ హాస్టల్‌కు వెళ్లింది. శనివారం ఉదయం పారాక్వాట్ గడ్డి మందును ఇంజెక్ట్ చేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన తోటి జూనియర్ డాక్టర్లు ఆమెను జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. ఇంటర్న్‌షి్‌పతో పాటు నీట్ పీజీ ప్రిపరేషన్ ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడినట్టు మెడికల్ కాలేజీ సిబ్బంది చెబుతున్నారు. వైద్యురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సిద్దిపేట త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది.