kumaram bheem asifabad- రసవత్తరం.. ఆసక్తికరం
ABN , Publish Date - Jan 29 , 2026 | 11:14 PM
నామినే షన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో మున్సి పాలిటీ ల్లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. వార్డుల్లో పోటీచేసేందుకు తమకు ఆవకాశం ఇవ్వాలని కోరు తూ ఆశావహులు ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జీలు, సీనియర్ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలో రెండు మున్సిపాలిటీల్లోని 50 వార్డుల్లో అభ్యర్థుల ఎంపికపై ఆయా పార్టీల నాయకులు కసరత్తు ముమ్మరం చేశారు.
- టికెట్ల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు
- వార్డుల వారీగా సమీకరణలు సరి చూసుకుంటున్న పార్టీలు
- నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం
ఆసిఫాబాద్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): నామినే షన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో మున్సి పాలిటీ ల్లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. వార్డుల్లో పోటీచేసేందుకు తమకు ఆవకాశం ఇవ్వాలని కోరు తూ ఆశావహులు ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జీలు, సీనియర్ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలో రెండు మున్సిపాలిటీల్లోని 50 వార్డుల్లో అభ్యర్థుల ఎంపికపై ఆయా పార్టీల నాయకులు కసరత్తు ముమ్మరం చేశారు. శుక్రవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఆయా పార్టీల నుంచి బరిలో నిలిచేం దుకు అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఒక్కో వార్డుకు ముగ్గురు నుంచి ఐదుగురి వరకు పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
- అభ్యర్థుల ఎంపికలో నిమగ్నం..
నామినేషన్ల ప్రక్రియ ఊపందుకోవడంతో ఎన్ని కలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల ఎంపికలో నిమగ్నమయ్యారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు గడువు ఉండ డంతో అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచారు. తక్కువ సమయం ఉండడంతో ప్రధాన పార్టీల నేతలకు అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములాగ మారింది. ఈ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నా యి. మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటుకునేందు కు అన్ని పార్టీలు యత్నిస్తున్నాయి. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలలో నువ్వా నేనా అన్న విధంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు పోటీ పడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహత్మకంగా ముందుకు సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృ ద్ధి. సంక్షేమ కార్యక్రమాలను తమను విజయపతం గా ముందుకు నడిపిస్తాయని భావిస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి తమస త్తా చాటుకోవాలని కేంద్రంలో మోదీ సర్కారు పాల న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలువాలనే లక్ష్యంతో బీజేపీ యత్ని స్తోంది. ప్రధాన పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందుతామని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
- పోటీదారుల హైరానా..
మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి దిగాలనుకునే అభ్య ర్థులు ఒకవైపు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తునే మరోవైపు నామినేషన్ వేయడానికి కావాల్సిన ధ్రువ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ పరుగులు తీస్తున్నారు. దీంతో జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌న గర్ మున్సిపాలిటీలలో నామినేషన్లకు అవసరమైన ధ్రువపత్రాల కోసం పెద్ద సంఖ్యలో ఆశావహలు తరలి రావడంతో ఆయా మున్సిపాలిటీలు కిక్కిరిసి పోతున్నాయి. మొదటి రోజు జిల్లాలోని రెండు మున్సిపాలిటీలలో పది నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు. దీం తో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవ కాశాలు ఉన్నాయి. సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి సమయం ఉంది.
- నామినేషన్ వేద్దాం.. బీఫామ్ చూద్దాం..
ఆయా వార్డులో బరిలో దిగే అభ్యర్థులు ముందు అయితే నామినేషన్ వేద్దాం.. బీఫామ్ ఇచ్చేది త ర్వాత చేద్దామనే ధోరణిలో ఎక్కువ మంది ఉన్నాఉ. ఆయా పార్టీల నుంచి ఎక్కువ మంది ఆశావహులు ఉండడం నామినేషన్లకు గడువు తక్కువగా ఉండడంతో అభ్యర్థులు టికెట్ వచ్చినా, రాకున్నా ముందయితే నామినేషన్ వేద్ద్దామనే ధోరణిలో ఉన్నా రు. ప్రధాన పార్టీలు వివాదం లేని చోట అభ్యర్థుల ను ప్రకటిస్తున్నాయి. ఒకే వార్డు నుంచి ఎక్కువ మంది పోటీ పడుతున్న చోట్ల బీఫామ్‌ల విషయం లో పార్టీ పెద్దలు సమాలోచిస్తున్నారు. ఏ ఒక్కరిని అభ్యర్థిగా ప్రకటించినా మిగిలిన వారు సమ స్యలు సృష్టించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. టికెట్ రాని వారు ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశం ఉందని యోచిస్తున్నారు. ఎన్నికల సంఘం నిబంధ నల ప్రకారం నామినేషన్ల ఉపసంహరణవరకు బీఫామ్ ఇచ్చే వెసులుబాటు ఉంది. దీంతో కొన్ని వార్డులకు అభ్యర్థులను చివరి నిమిషంలోనే ప్రక టించే అవకాశం ఉందని చెబుతున్నారు.