Share News

‘జైలుకెళితే.. పదవి ఖాళీ’ బిల్లుపై జేపీసీ భేటీ

ABN , Publish Date - May 22 , 2026 | 04:04 AM

తీవ్రమైన క్రిమినల్‌ కేసుల్లో అరెస్టయి 30 రోజులకుపైగా జైలులో ఉన్న ప్రజాప్రతినిధులు ఆటోమేటిగ్గా పదవి కోల్పోయేందుకు ఉద్దేశించిన ‘130వ రాజ్యాంగ సవరణ ....

‘జైలుకెళితే.. పదవి ఖాళీ’ బిల్లుపై జేపీసీ భేటీ

  • ప్రజాప్రతినిధులు 30 రోజులకుపైగా జైల్లో ఉంటే పదవులు కోల్పోయేలా బిల్లు

  • దానిపై సూచనల కోసం సమావేశం నిర్వహించిన పార్లమెంటరీ కమిటీ

  • తెలంగాణ సీఎస్‌ రామకృష్ణారావు, పలు రాష్ట్రాల ప్రతినిధుల హాజరు

న్యూఢిల్లీ, మే 21 (ఆంధ్రజ్యోతి): తీవ్రమైన క్రిమినల్‌ కేసుల్లో అరెస్టయి 30 రోజులకుపైగా జైలులో ఉన్న ప్రజాప్రతినిధులు ఆటోమేటిగ్గా పదవి కోల్పోయేందుకు ఉద్దేశించిన ‘130వ రాజ్యాంగ సవరణ బిల్లు--2025’పై కసరత్తు ముమ్మరమైంది. ఈ అంశంపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) గురువారం ఢిల్లీలోని పార్లమెంట్‌ అనెక్స్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌, పంజాబ్‌ రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులతోపాటు చాణక్య నేషనల్‌ లా యూనివర్సిటీ (పాట్నా), మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (తెలంగాణ), బాబాసాహెబ్‌ భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ (లక్నో) ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) రామకృష్ణారావు పాల్గొని.. బిల్లులోని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వపక్షాన పలు సూచనలు చేశారు. నిబంధనల్లో కొన్ని మార్పులు చేయాలని కోరినట్టు సమాచారం. ‘130వ రాజ్యాంగ సవరణ బిల్లు--2025’ ప్రకారం.. ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్షపడే అవకాశమున్న క్రిమినల్‌ కేసుల్లో అరెస్టయి, ముప్పై రోజుల పాటు జైల్లోనే ఉండాల్సి వేస్త.. ప్రధాని, సీఎంలు, మంత్రులైనా సరే 31వ రోజున వారి పదవి ఆటోమేటిగ్గా రద్దవుతుంది. ఎన్డీయే ప్రభుత్వం గతేడాది లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా.. ప్రతిపక్షాల నుంచి నిరసన వ్యక్తమైంది. ఇది చట్టరూపం దాల్చితే తీవ్రంగా దుర్వినియోమయ్యే అవకాశం ఉందన్న విమర్శలు వచ్చాయి. దీనితో ఈ బిల్లును జేపీసీ పరిశీలనకు పంపారు. జేపీసీ తాజాగా సమావేశమై రాష్ట్రాలు, వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను ేసకరించింది. ఏయే సెక్షన్ల కింద నమోదయ్యే కేసులకు ఈ నిబంధన వర్తింపజేయాలి? 30 రోజుల గడువు విధింపులో ఎలాంటి మినహాయింపులు ఉండాలనే అంశాలపై పలు సూచనలు వచ్చినట్టు సమాచారం.

Updated Date - May 22 , 2026 | 04:04 AM