Share News

అక్రెడిటేషన్‌ కార్డుల దరఖాస్తులో సాంకేతిక సమస్యలుంటే సంప్రదించండి

ABN , Publish Date - Feb 19 , 2026 | 05:02 AM

అక్రెడిటేషన్‌ కార్డుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో జర్నలిస్టులకు ఏవైనా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైతే సమాచార శాఖ మీడియా రిలేషన్‌...

అక్రెడిటేషన్‌ కార్డుల దరఖాస్తులో సాంకేతిక సమస్యలుంటే సంప్రదించండి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): అక్రెడిటేషన్‌ కార్డుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో జర్నలిస్టులకు ఏవైనా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైతే సమాచార శాఖ మీడియా రిలేషన్‌ విభాగాన్ని (ఫోన్‌ నెంబర్‌ 9154170881లో) సంప్రదించాలని సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌ సీహెచ్‌ ప్రియాంక తెలిపారు. రాష్ట్రంలోని ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌, డిజిటల్‌, ఫ్రీల్యాన్స్‌, వెటరన్‌ జర్నలిస్టులు అక్రెడిటేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి సమాచార శాఖ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించిందని ఓ ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని జర్నలిస్టులకు సూచించారు. అక్రెడిటేషన్‌ కార్డు దరఖాస్తులు, జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆమె తెలిపారు. జర్నలిస్టులు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని, అర్హులైన అందరికి అక్రెడిటేషన్‌ కార్డులు జారీ చేస్తామని పేర్కొన్నారు.

Updated Date - Feb 19 , 2026 | 05:02 AM