kumaram bheem asifabad- జాలీ జాలీగా.. హోలీ ఆడేద్దామా..
ABN , Publish Date - Mar 01 , 2026 | 10:22 PM
వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలుగా మారిపోయే వేడుకంటే హోలీనే గుర్తొస్తుంది. కదూ. ఎంత సేపు ఆడినా తనివి తీరదు. సమయమూ తెలియదు. ఒళ్లంతా రంగులతో నిండిపోతే మనసుకి తెలియని ఉత్సా హం. మరి ఆ తరువాత రంగులను వదల గొట్టడా నికి నానా తిప్పలు పడాలి. పిల్లల ఆనందాలను కాదనలేక తల్లిదండ్రులు పలు రకాల రంగులను కొనిస్తారు. ఇందులో ప్రమాదకర రసాయనాలున్నా యన్న విషయాన్ని గమనించాల్సి ఉంది. సహజ రంగులను హోలీ పంబరాల్లో వాడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
- సహజరంగులు వినియోగిస్తే మేలు
- పలుచోట్ల కామ దహనాలు
బెజ్జూరు, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలుగా మారిపోయే వేడుకంటే హోలీనే గుర్తొస్తుంది. కదూ. ఎంత సేపు ఆడినా తనివి తీరదు. సమయమూ తెలియదు. ఒళ్లంతా రంగులతో నిండిపోతే మనసుకి తెలియని ఉత్సా హం. మరి ఆ తరువాత రంగులను వదల గొట్టడా నికి నానా తిప్పలు పడాలి. పిల్లల ఆనందాలను కాదనలేక తల్లిదండ్రులు పలు రకాల రంగులను కొనిస్తారు. ఇందులో ప్రమాదకర రసాయనాలున్నా యన్న విషయాన్ని గమనించాల్సి ఉంది. సహజ రంగులను హోలీ పంబరాల్లో వాడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉత్తర భారత దేశంలో చాలా చోట్ల సహజ రంగులను ఎక్కువగా వాడుతుంటారు. పూలు, ఆకులు, పండ్లతో రంగులను తయారుచేసే ఓపిక, తీరిక లేని నేటా ఆదునిక కాలంలో రసాయన రంగులను విరివిగా ఉపయోగిస్తున్నారు. దేవుళ్లకు పూజలు చేసి రంగు లు చల్లుకుంటారు. కోలాటాలు ఆడుతూ నృత్యాలు చేస్తారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో పలుచోట్ల డీజేలు పెట్టి రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేయడం పరిపాటిగా వస్తోంది. కూడళ్లలో కామ దహనాలు చేస్తూ సందడి చేస్తారు.
- ఈ జాగ్రత్తలు పాటించాలి..
చర్మానికి రంగులు పట్టుకోకుండా ఆవాల నూనే కాని, పెట్రోలియం జెల్లీని బాగా పట్టించాలి. కళ్లలో రంగులు పడకుండా కంటి అద్దాలను వాడాలి. పొడవాటి చేతులు ఉన్న దుస్తులు దరించాలి. మొటిమలు ఉన్నవారు రంగులు ముఖంపై పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ఈ సమస్య మరింత ఎక్కువై ఇబ్బంది పెడుతుంది. హోలీ ఆడిన వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. లేకుంటే చేతివేళ్ల గోర్ల నుంచి రంగులు శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అదే విదంగా రంగులను పూసుకునే ముందు మాయిశ్చరైజర్ క్రీమ్ లేదా కొబ్బరి నూనె రాసుకోవాలి. తలకు నూనె రాసుకోవడం మంచిది. రంగులు కంట్లోకి, నోటిలోకి పోకుండా జాగ్రత్త పడాలి. రంగు పూసుకున్న వెంటనే కడగడం, మళ్లీ పూసుకొని కడుక్కోవడం చేయకూడదు. హోలీ ఆడాక స్నానం చేయాలి. తరచూ కడగడంతో రసాయనాలు స్వేద రంద్రాల ద్వారా లోపలికి వెళ్లే ప్రమాదం ఉంది. చర్మం పొడిబారి మంట వస్తుంది. ఎర్రగా మారి దురద పెడుతుంది. ఆయిల్ స్కిన్ వారికంటే డ్రైస్కిన్ వారికి రంగులు సులువుగా చర్మ రంద్రాల ద్వారా లోపలికి వెళ్తుంది.
- ఇతరులకు ఇబ్బంది కలగకుండా..
మన ఆనందం ఇంకొకరికి ఆవేదన కలిగించకూడ దు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో యువకులు బైకుల పై దూసుకొచ్చి పాదాచారులు, వాహనదారులపై రంగులు చల్లుతున్నారు. దీనివల్ల ఖరీదైన వస్ర్తాలు కరాబు కావడంతో అనేక మంది ఆవేదన చెందుతు న్నారు. స్నేహితులు, తెలిసినవాళ్లపై రంగులు చల్లితే ఎవ్వరూ తప్పుపట్టరు. కానీ రోడ్లపై రంగులతో విన్యాసాలు చేయకుండా నిరోదించాలి. పోలీసులు యువతలో అవగాహన కల్పించాల్సి ఉంది. అదే విధంగా ఈ నెల 3న హోలీ రోజున పర్యవేక్షిం చాల్సిన అవసరం ఉంది.
- రసాయన రంగులతో..
రంగుల్లో పాదరసం, సిలికా, మైకా, సీసం వంటి పలురకాల రసాయనాలు ఉంటాయి. ఇవి చర్మానికి, కళ్లకు, శ్వాస సంబంధ సమస్యలకు కారణం అవు తాయి. వాటర్‌గన్, వాటర్ బెలూన్‌లతో హోలీ ఆడ డం వల్ల చెవిలోకి రంగునీరు వెళ్లి దురద, చెవినొప్పి కలుగుతుంది. చెవిపొర దెబ్బతిని చెవిపోటు కలుగుతుంది. పొడి రంగులను చల్లినప్పుడు అవి గాలిలో కలిసిపోయి నోటిలోకి, శ్వాసనాళాల్లోకి పోయి శ్వాసకోశ సమస్యలు కలిగిస్తాయి. మనం గాలి పీల్చినప్పుడు ఈ రంగులు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి అక్కడే ఉండిపోయి దీర్గకాల సమస్యలను కలిగిస్తాయి. అస్తమా, ఎలర్జీ కలుగుతుంది. సింథటిక్ రంగులను వాడడం వల్ల జలుబు, అలర్జీ కలుగుతాయి. దురద, మంట, నొప్పి కలుగుతుం టాయి. కళ్లల్లోకి రంగులు పడినప్పుడు కళ్లమంట, దురద పెరుగుతుంది. కళ్లు ఎర్రగా మారుతాయి. గాడమైన రంగులు పడినప్పుడు కంటిపొరలు దెబ్బతిని చూపు మందగించే అవకాశం ఉంది. రంగులు నోట్లోకి వెళితే వాంతులు, విరోయనాలు అవుతాయి. రసాయనాలు చర్మం గుండా శరీరంలోకి చేరుతుంది. దీంతో వికారం, వాంతులు, కడుపునొప్పి కలుగుతాయి.
- రంగులు ఇలా..
పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో రకరకాల రంగులను తయారు చేసుకొని హోలీ ఆడుకోవచ్చు. వీటితో ఎలాంటి ముప్పు ఉండదు. దానిమ్మ, టమాటాలతో ఎరుపు. మోదుగుపూలు, క్యారట్‌తో ఆరెంజ్ రంగు, బీట్‌రూట్‌తో ఊదారంగు, పాలకూర, కొత్తిమీరతో ఆకుపచ్చ రంగు, సహజసిద్ద పసుపు, కుంకుమలతో ఆయా రంగులు, బంతి, చామంతి పువ్వుల రంగును బట్టి ఆయా రంగులను సిద్ధం చేసుకోవచ్చు. వీటిని మరగబెట్టడం వల్ల మరింత గాడత్వం సంతరించుకుంటాయి. కాగా జిల్లాలోని అటవీ ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు, చెరువు గట్లు ఇతర ప్రాంతాల్లో ఈ సమయంలో ఒక అద్బుతం ఆవిష్కృతమవుతుంది. దీనిని ఆంగ్లంలో ఫేమ్ ఆప్ ది ఫారెస్టు(తెలుగులో మోదుగ, సంస్కృ తంలో పలాశ) అని పిలిచే ఈ వృక్షం భారతీయ సంస్కృతికి ఒక గొప్ప నిధి, ఈ పూలు చూడటానికి చిలుకముక్కు ఆకారంలో ఉండి ఎరుపు, నారింజ రంగుల కలయికతో మెరుస్తూ ఉంటాయి. ఈ పూలు వికసించినప్పుడు చెట్టుకు ఆకులు ఉండవు. కేవలం పూలు మాత్రమే ఉండి సిందూర వర్ణంగా కనిపిస్తాయి. . గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన తండా ల్లో పూర్వీకుల కాలం నుంచి మోదుగపూలతోనే హోలీ ఆడుతున్నారు. మోదుగపూలను సేకరించి వాటిని ఎండబెట్టి పొడి చేస్తారు. లేదా పచ్చి పూల ను నీళ్లలో వేసి మరిగిస్తే ఆ నీరు నారింజ రంగు లోకి మారుతుంది. ఈ రంగు నీళ్లతో స్నానం చేయ డం వల్ల చర్మంపై ఉన్న క్రిములు నశిస్తాయి. ఈ పూలు ఆయుర్వేద వైద్యంగా కూడా పని చేస్తుందని చెబుతారు.